కోటా ఆస్పత్రి విషాదం మరువక ముందే మరోదారుణం.. పీబీఎం ఆస్పత్రిలో 162మంది చిన్నారుల మృతి

కోటా ఆస్పత్రి విషాదం మరువక ముందే మరోదారుణం.. పీబీఎం ఆస్పత్రిలో 162మంది చిన్నారుల మృతి

రాజస్థాన్ కోటా ఆస్పత్రిలో చిన్నారుల మృతి చెందిన దారుణం మరువక ముందే మరో హృదయ విదాకర సంఘటన  వెలుగులోకి వచ్చింది.  రాజస్థాన్ బికినీర్ లోని పీబీఎం ఆస్పత్రిలో డిసెంబర్ నెలలో 162మంది చిన్నారులు ఐసీయూలో మృతి చెందినట్లు సర్దార్ పటేల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హెచ్ ఎస్ కుమార్ తెలిపారు.  ఆస్పత్రిలో అన్నీ సౌకర్యాలు ఉన్నాయని , నిర్లక్ష్యంతో మృతి చెందలేదని అన్నారు. తమవంతుగా పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

గుజరాత్ లోని అహమ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మరో విషాదం

గుజరాత్ లోని అహమ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మరో విషాదం చోటు చేసుకుంది. డిసెంబర్ నెలలో 455మంది చిన్నారులు జన్మించారు. వారిలో 85మంది చిన్నారులు ఐసీయూలో మరణించినట్లు ఆస్పత్రి సూపరిటెండెంట్ జీఎస్ రాథోడ్ తెలిపారు.