కైటెక్స్ కంపెనీలో  1800 స్టిచ్చింగ్ పోస్టులు

కైటెక్స్ కంపెనీలో  1800 స్టిచ్చింగ్ పోస్టులు

పర్వతగిరి (గీసుగొండ), వెలుగు: వరంగల్​ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగాటెక్స్​ టైల్ పార్కులోని కైటెక్స్ కంపెనీలో 1800 స్టిచ్చింగ్ పోస్టులు ఉన్నట్లు కలెక్టర్​ సత్యశారద తెలిపారు. మంగళవారం పోస్టుల భర్తీకి సంబంధించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ టైలరింగ్ పై పట్టు ఉన్న మహిళలకు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నియామక ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఉద్యోగాలకు నెలకు రూ.12,300  నుంచి రూ.21,800 వరకు వేతనం ఉంటుందని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఈ ఉపాధి లభిస్తుందన్నారు. వరంగల్ ప్రజలకు ప్రాధాన్యత ఉంటుందని, ఉద్యోగ నియామకాలకు సంబంధించి విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా వరంగల్ జిల్లాలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని, స్థానిక యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.