హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ మూడో ఎడిషన్‌లో పాల్గొనే అవకాశం రాష్ట్రం నుంచి 19 మంది స్టూడెంట్స్‌కు దక్కింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో సోమవారం ప్రారంభమయ్యే ఇంటరాక్షన్ మీటింగ్‌లో స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు ఇవ్వడంతోపాటు సూచనలు చేస్తారు. దేశవ్యాప్తంగా 2,200 మంది స్టూడెంట్స్ పాల్గొంటారు. రాష్ట్రం నుంచి 19 మందిని ఎంపిక చేసి ఢిల్లీకి పంపినట్లు స్కూల్ఎడ్యుకేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. తొమ్మిదో తరగతివారు ఏడుగురు, పదో తరగతి వారు నలుగురు, 11వ తరగతివారు ఐదుగురు, 12వ తరగతి వారు ముగ్గురు ఉన్నారని వివరించారు. ఈ ప్రోగ్రాం దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా ప్రసారం జరుగుతుందని, రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలోని స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంను చూసేలా ఏర్పాట్లు చేయాలని డీఈవోలను ఆయన
ఆదేశించారు.
పరీక్షా పే చర్చలో పాల్గొనే మన స్టూడెంట్స్వీరే…
గణేశ్(కేవీ, కరీంనగర్), సునీల్, బి.మహేశ్ (నవోదయ, నిజామాబాద్), వర్షారెడ్డి, నందిని(ఎన్టీఆర్ మోడల్‌స్కూల్, రంగారెడ్డి), సౌమ్య(హిందూ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్), ఐశిత( న్యూ క్రియేషన్ ఏ ఫ్రీ ప్రోగ్రెస్ స్కూల్, జనగాం), బుష్రా ఖాటూన్ (కేవీ, గచ్చిబౌలి), సదక్ హన్సిని(శ్రీభాషిత గ్రామర్ హైస్కూల్, నిజామాబాద్), అరవింద్, మురళి అజ్మీర( నవోదయ, కరీంనగర్), అఖిల( జడ్పీహెచ్ఎస్ మహాలింగాపురం, రంగారెడ్డి), బి.భౌమిక్ (కేవీ, రంగారెడ్డి), సాత్వికరెడ్డి(బాలాజీ టెక్నో స్కూల్, వరంగల్ రూరల్), అభిషేక్ (నవోదయ, సిద్దిపేట), అక్షయ అంబటి (కెసిస్టన్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్), మేఘన ( నవోదయ, వరంగల్), తరుణి గోపి (హిందూపబ్లిక్ స్కూల్, రంగారెడ్డి), హరిప్రియ (ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, హైదరాబాద్).
For More News..
