జింబాబ్వేపై రాణిస్తున్న టీమిండియా

జింబాబ్వేపై రాణిస్తున్న టీమిండియా

జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాట్ ఝులిపించాడు. జింబాబ్వే బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 76 బంతులను ఎదుర్కొన్న ధావన్.. 6 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. అతనికి మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ చక్కటి సహకారం అందించాడు. అతను కూడా అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు. జింబాబ్వే జట్టుతో తొలి వన్డే హరారేలో జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుందనే అంచనాతో ఫీల్డింగ్ తీసుకోవడం జరిగిందని కెప్టెన్ రాహుల్ వెల్లడించాడు. అనుకున్నట్లుగానే అలాగే జరిగింది.

జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కేవలం 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో దీపక్ చహార్, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్ లు చెరో మూడు వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ తీశారు. అనంతరం 190 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఓపెనర్లు ధావన్, గిల్ లు ఆచితూచి ఆడారు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ.. స్కోరు బోర్డును పరుగెత్తించారు. ప్రస్తుతం ధావన్ 55, గిల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 19.4 ఓవర్లలో 104 పరుగులు చేసింది.