దారులన్నీ సలేశ్వరం వైపే..

దారులన్నీ సలేశ్వరం వైపే..
  • రెండో రోజూ లక్షలాది మంది 
  • భక్తుల రాక

అచ్చంపేట/ అమ్రాబాద్, వెలుగు: సలేశ్వరం లింగమయ్య జాతర రెండోరోజు భక్తులు పోటెత్తారు. గతంలో 8 రోజుల పాటు జరిగే జాతరను 3 రోజులకే పరిమితం చేయడంతో భక్తులు లింగమయ్య దర్శనానికి తరలివచ్చి ఇబ్బందులు పడ్డారు. గురువారం పౌర్ణిమ కావడంతో భక్తులు అధిక సంఖ్యతో తరలివచ్చారు. వస్తున్నాం.. వస్తున్నాం లింగమయ్య అంటూ భక్తులు చేసిన శివనామ స్మరణతో అడవంతా పులకించింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చారు. కర్రలు చేత పట్టుకొని అడవిలో నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. 

కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల కోసం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఈ హేమలత, ఏఈ మధుబాబు ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు అన్నదానం ఏర్పాటు చేశారు. తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు.