
కుప్వారా: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో మిలిటెంట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులతోపాటు ఒక బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయారు. కెరాన్ సెక్టార్‌కు సమీపంలో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌వోసీ) వద్ద ఈ ఘటన జరిగింది. భారత భూభాగంలోకి చొరబడాలని చూసిన మిలిటెంట్లను ప్యాట్రోలింగ్ టీమ్స్ గుర్తించాయి. దీంతో వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.