
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రదాడి జరిగింది. వియన్నాలో ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోగా.. కొందరికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగన బలగాలు ఓ ఉగ్రవాదిని కాల్చి చంపాయి. వియన్నాలో భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రవేట కోసం హెలికాప్టర్లు రంగంలోకి దింపారు. ఉగ్రదాడి నేపథ్యంలో వియన్నాలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది ప్రభుత్వం. బస్టాప్ లు , రైల్వే స్టేషన్ల బంటి రద్దీ ప్రాంతాల్లో ఉండొద్దని హెచ్చరించింది.