
- ఒక సామాన్యుడు కూడా మరణం
- ముష్కర చొరబాట్లకు పాక్ ఆర్మీ సాయం
కుప్వారా: భారత సైన్యం కళ్లుగప్పి.. ఉగ్రవాదుల్ని సరిహద్దు దాటించేందుకు పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ము కశ్మీర్ లోని తంధార్, నౌగం, కుప్వారా సెక్టార్లలోని సరిహద్దు రేఖ దగ్గర ఈ రోజు ఉదయం కాల్పులకు దిగారు పాక్ రేంజర్లు. దీన్ని తిప్పి కొట్టే క్రమంలో భారత ఆర్మీ ఇద్దరు జవాన్లను కోల్పోయింది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజల ఇళ్లపై కూడా కాల్పుల వర్షం కురిపించింది. దీంతో ఓ సామాన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
ముష్కర మూకల్ని భారత్ లోకి పంపించేందుకు ప్లాన్ చేసిన ప్రతిసారి పాక్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. సరిహద్దు వెంట కాల్పులకు పాల్పడితే.. భారత ఆర్మీ అంతా వాటిని తిప్పికొట్టే పనిలో ఉంటారు. ఈ సమయంలో ఈజీగా ఉగ్రవాదులు సరిహద్దు దాటేస్తారని పాక్ కుట్ర. అయితే ఓ వైపు పాక్ ఆర్మీకి గట్టి బుద్ధి చెబుతూనే.. మరోవైపు ఉగ్ర మూకల చొరబాట్లను కూడా సమర్థంగా అడ్డుకుంటోంది మన ఆర్మీ. టెర్రరిస్టుల్ని సరిహద్దు ప్రాంతం దాటి రానీయకుండా మట్టుబెడుతోంది.