గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 12 ఏండ్ల జైలు

గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 12 ఏండ్ల జైలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి 12 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌‌‌‌ వసంత్‌‌‌‌ బుధవారం తీర్పు చెప్పారు. 2023 జూన్‌‌‌‌ 16న భద్రాచలంలోని సీఆర్పీ కూనవరం రోడ్‌‌‌‌లో మారుతీ ఈకో వ్యాన్‌‌‌‌లో తరలిస్తున్న 242 గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.

భద్రాచలం పట్టణానికి చెందిన తాడి శివశంకర్, ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌‌‌‌గిరి జిల్లాకు చెందిన అజ్గర్‌‌‌‌ ఖాన్‌‌‌‌పై అలియాస్‌‌‌‌ సంతోష్‌‌‌‌పై భద్రాచలం అప్పటి ఎస్సై పి. శ్రీకాంత్‌‌‌‌ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం శివశంకర్, సంతోష్‌‌‌‌పై నేరం నిరూపణ కావడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.