దేశవ్యాప్తంగా కరోనా కరోనా కేసులు పెరుగుతుండటంతో రైలు బోగీలను కరోనా ట్రీట్ మెంట్ సెంటర్లుగా మారుస్తున్నారు. అందుకు ప్రత్యేక కోచ్ లను సిద్ధం చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్ గైడ్ లైన్స్ పాటిస్తూ బోగీల్లో పేషెంట్లకు అన్ని సౌకర్యాలు కల్పించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. బెర్త్ కో కూలర్ ను ఏర్పాటు చేశారు.320 పడకలు కలిగిన 20 ఐసోలేషన్ కోచ్ లను భోపాల్ రైల్వే స్టేషన్ లో ఇలా ఏర్పాటు చేశారు.
