ప్రపంచవ్యాప్తంగా రికవరైనోళ్లు 20 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా రికవరైనోళ్లు 20 లక్షలు

న్యూఢిల్లీ: కరోనా బారిన పడినోళ్లు కోలుకుంటున్నారు. కేసులతో పాటే రికవరీలూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 20,51,407 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసులు 51,39,917కు చేరాయి. కేసులతో పోలిస్తే రికవరీ రేట్​ 39.91 శాతంగా ఉంది. 3,31,707 మంది చనిపోతే.. డెత్​రేట్​ 6.45%. రికవరీలు, మరణాల విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే మన దేశం మెరుగైన స్థానంలో ఉంది. దేశంలో 48,540  మంది కోలుకున్నారు. రికవరీ రేట్​ 41శాతం ఉంది. గురువారం 3,118 మంది డిశ్చార్జి అయ్యారు. గురువారం 148 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,584కి పెరిగింది.

మరణాల రేటు 3 శాతం. ప్రపంచ డెత్​రేట్​6.45%తో పోలిస్తే ఇండియా మెరుగైన స్థానంలో ఉంది. సరైన టైంలో కేసులను గుర్తించడం, మెడికల్​ సౌకర్యాలతోనే మరణాల రేటు తక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. ఇప్పటిదాకా 2,300 మంది కరోనా పేషెంట్లు ఆయుష్మాన్​ భారత్​ కింద ఫ్రీ ట్రీట్​మెంట్​ తీసుకున్నారని, నెలన్నర రోజుల్లో ఆయుష్మాన్​ భారత్​ కింద కరోనా టెస్టులు చేయించుకున్నోళ్లలో 3 వేల మందికి పాజిటివ్​ వచ్చిందని ఆయుష్మాన్​ భారత్​, నేషనల్​ హెల్త్​ అథారిటీ సీఈవో డాక్టర్​ ఇందూ భూషణ్​ తెలిపారు.  దేశంలో మరోసారి రికార్డుస్థాయిలో కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గురువారం 6,025 మందికి పాజిటివ్​గా తేలింది. దీంతో దేశంలో కేసుల సంఖ్య 1,18,222కి పెరిగింది. అంతకుముందు మంగళవారం ఒక్కరోజే 6,154 కేసులు రికార్డయ్యాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి