అంగన్ వాడీలో జాబ్ ఆశ చూపించి 20 మందిపై గ్యాంగ్ రేప్

అంగన్ వాడీలో జాబ్ ఆశ చూపించి 20 మందిపై గ్యాంగ్ రేప్

ఉద్యోగం ఆశ చూపించి 20మంది మహిళలపై ఇద్దరు అధికారులు అత్యాచారానికి పాల్పడ్డారని రాజస్థాన్ లోని పాలి జిల్లా సిరోహిలో కేసు నమోదైంది. సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మహేంద్ర మేవాడా, మాజీ కమిషనర్ మహేంద్ర చౌదరిపై గ్యాంగ్ రేప్ కేసు ఫిర్యాదు వచ్చింది. రెండు నెలల క్రితం అంగన్ వాడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పాలి జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు డీవైఎస్పీ పరాస్ చౌదరికి ఫిర్యాదు చేసింది. 

ALSO READ :- శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు

తనతో పాటు మరో పది 15 మందికి ఓ చోట వసతి ఏర్పాటు చేసి, తినే ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చారని, తర్వాత చైర్మన్, కమిషనర్ వారిపై సామూహిక అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. వీడియోలు తీసి ఒక్కొక్కరూ రూ.5లక్షలు ఇవ్వాలని లేదంటే వీడియోలను వైరల్ చేస్తామంటూ ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తు్న్నారని బాధితురాలు చెప్పింది.  వారితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బెదిరించారని,  ఉద్యోగాల సాకుతో ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సిరోహి మహిళా పోలీస్ స్టేషన్ కు గతంలో కూడా ఇలాంటి కేసు వచ్చింది. కానీ, అది తప్పు అని తేలింది. దీంతో దానిపై కూడా ఇప్పుడు కేసు ఫైల్ చేయాలని రాజస్థాన్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.