T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం

T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం

ఐసీసీ టోర్నీ అంటే చాలు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తారు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగక దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఐసీసీ టోర్నీలో దాయాదుల సమరాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  దానికి తగ్గట్టుగానే ఐసీసీ టోర్నీల్లో 2013 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా ఐసీసీ షెడ్యూల్ సిద్ధం చేస్తుంది. తాజాగా 2024 టీ 20 వరల్డ్ కప్ కు సైతం భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ లో ఉండడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

జూన్ 9 న భారత్, పాక్ న్యూయార్క్ సిటీలో తలపడడం ఖాయమైంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. న్యూయార్క్ స్టేడియం ఇంకా నిర్మించలేదని తెలుస్తుంది. ఈ స్టేడియం ఇంకా నిర్మాణంలోనే ఉంది. తాజా సమాచార ప్రకారం ఈ స్టేడియం 70 శాతం పూర్తయినట్టుగా తెలుస్తుంది. స్టేడియాన్ని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చూస్తుంటే స్టేడియం కెపాసిటీ తక్కువగా ఉన్నట్లుగా అర్ధమవుతుంది. పిచ్ ను ఇంకా సిద్ధం చేయకపోగా.. త్వరలోనే మొత్తం సిద్ధం చేయనున్నారని నివేదికలు చెబుతున్నాయి. 

గతంలో ఈ స్టేడియం చూడడానికి చుట్టూ చెట్లు పుట్టలతో దారుణంగా ఉంది. గ్రౌండ్ చూడడానికి గల్లీ స్టేడియంలా కూడా లేకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ షాక్ అయ్యారు. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.