ఈ–క్లచ్​తో హోండా కొత్త బైక్స్​... డెలివరీలు మే నెల చివరి వారం నుంచి ప్రారంభం

ఈ–క్లచ్​తో హోండా కొత్త బైక్స్​... డెలివరీలు మే నెల చివరి వారం నుంచి ప్రారంభం

హోండా మోటార్‌‌‌‌ సైకిల్ అండ్​ స్కూటర్ ఇండియా 2025 సీబీ 650ఆర్​, సీబీఆర్​650ఆర్​ మోడల్స్‌‌‌‌ను ఈ–క్లచ్ ​టెక్నాలజీతో విడుదల చేసింది.  క్లచ్ లీవర్‌‌‌‌ను ఉపయోగించకుండానే గేర్లు మార్చడానికి, స్టార్ట్ చేయడానికి, ఆపడానికి ఇది సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా అన్ని బిగ్‌‌‌‌వింగ్ డీలర్‌‌‌‌షిప్‌‌‌‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

డెలివరీలు ఈనెల చివరి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2025 సీబీ650ఆర్​ ధర రూ. 9.60 లక్షలు కాగా, సీబీఆర్​650ఆర్​ ధర రూ. 10.40 లక్షలు (ఎక్స్‌‌‌‌షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ బైకుల్లో 649సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్‌‌‌‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 70 కిలోవాట్ల శక్తిని, గరిష్టంగా 63 ఎన్​ఎం టార్క్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది.