టీవీఎస్ అపాచీ ఆర్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ 310 లో కొత్త వెర్షన్‌‌‌‌

టీవీఎస్ అపాచీ ఆర్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ 310 లో కొత్త వెర్షన్‌‌‌‌

టీవీఎస్‌‌‌‌ మోటార్ కంపెనీ  అపాచీ ఆర్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ 310 సీసీ మోడల్‌‌‌‌లో 2025 వెర్షన్‌‌‌‌ను లాంచ్ చేసింది.  ఈ బైక్  బేస్ వేరియంట్ ధర రూ.2.39 లక్షలు,  టాప్ వేరియంట్  ధర రూ.2.57 లక్షలు.  బిల్ట్‌‌‌‌ టు ఆర్డర్‌‌‌‌‌‌‌‌ (బీటీఓ) ధర రూ.2.75 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. 

అన్నీ ఎక్స్‌‌‌‌షోరూమ్‌‌‌‌ ధరలు. బీటీఓ అంటే ఆర్డర్ వచ్చాక తయారీ మొదలు పెడతారు.  టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అపాచీ ఆర్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ 310 (Apache RTR 310) కొత్త వెర్షన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 2025 మోడల్ ధర తగ్గింది కూడా. 

ఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌కతా, బెంగళూరు, చెన్నైలో  ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. ఇందులో  ఓబీడీ 2బీ కంప్లయన్స్, 43ఎంఎం యూఎస్‌‌‌‌డీ ఫ్రంట్ సస్పెన్షన్, సీక్వెన్షియల్ టర్న్ సిగ్నల్స్, హ్యాండ్ గార్డ్స్, ట్రాన్స్‌‌‌‌పరెంట్ క్లచ్ కవర్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  మూడు కొత్త రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

కొత్త ఫీచర్లు, అప్టేట్స్ .. 

ఇంజిన్ బ్రేకింగ్, డౌన్‌షిఫ్టింగ్ సమయంలో వెనుక చక్రం జారిపోకుండా నిరోధించడానికి డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఉంటుంది.ఇది స్లిప్/అసిస్ట్ క్లచ్‌తో కలిసి పనిచేస్తుంది. ఇది 312.12cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ అప్‌డేట్ చేసిన ఇంజిన్ తో వస్తుంది. ఇది 9,700 rpm వద్ద 35.08 bhp శక్తిని, 6,650 rpm వద్ద 28.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది.

 స్పోర్ట్, ట్రాక్, అర్బన్, రెయిన్, సూపర్మోటో వంటి 5 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి విభిన్న రైడింగ్ కు అనుగుణంగా ఉంటాయి. 
క్విక్‌షిఫ్టర్: బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అందుబాటులో ఉంది. ఇది గేర్ మార్చడం మరితం సులభం అవుతుంది. 
43mm USD ఫ్రంట్ సస్పెన్షన్ (అడ్జస్టబుల్) ,వెనుక భాగంలో మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS తో ముందు ,వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

కొత్త డిజైన్ ఎలిమెంట్స్:

  • కొత్త క్లాస్-డి LED రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్.
  • డైనమిక్ ట్విన్ టెయిల్ ల్యాంప్.
  • హ్యాండ్ గార్డ్‌లు.
  • పారదర్శక క్లచ్ కవర్ - ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ఈ కొత్త వెర్షన్ అపాచీ ఆర్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ 310 మెరుగైన పనితీరు, అడ్వాన్స్ డ్ ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్లో పోటీని పెంచడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కేటీఎం ,BMW వంటి ప్రీమియం బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని TVS మోటార్ కంపెనీ పేర్కొంది.