
కొత్తగా నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య చూస్తే ఆ వైరస్ బారి నుంచి ఇప్పుడిప్పుడే చైనా తేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. బుధవారం కేవలం 394 కేసులే నమోదైనట్టు ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. అంతకుముందు రోజుతో నమోదైన 1,700 కేసులతో పోలిస్తే చాలా వరకు తగ్గింది. వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. కొత్తగా నమోదైన కేసులతో పోలిస్తే డిశ్చార్జ్ అయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 16,155 మంది పేషెంట్లను ఆస్పత్రుల నుంచి పంపించినట్టు అధికారులు చెబుతున్నారు.అయితే, మొత్తం కేసుల సంఖ్య 74,576కి పెరిగింది. వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 2,118కి చేరింది. బుధవారం ఒక్కరోజే 114 మంది వైరస్‌తో చనిపోయారు. బుధవారం 1,779 మందిని హాస్పిటళ్ల నుంచి ఇంటికి పంపించారు.