జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి : బీసీ నాయకులు

జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి : బీసీ నాయకులు

సూర్యాపేట, వెలుగు: బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్యయాదవ్ ఫోన్ ను ట్యాపింగ్ చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సూర్యాపేటలో బీసీ నాయకులు జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ తోనే వట్టే జానయ్య యాదవ్ గెలుపును జగదీశ్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేసి జానయ్యను భౌతికంగా లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. 

జానయ్య యాదవ్ ఫోన్ తోపాటు 200 మంది ఆయన అనుచరుల ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లి పోటీ చేయాలని సవాల్​విసిరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజేశ్, నాయకులు వల్లాల సైదులు యాదవ్, కుంభం వెంకన్న యాదవ్, బొల్లె సైదులు, మీర్ అక్బర్, బారి అశోక్ యాదవ్, ఆవుల అంజయ్యయాదవ్, మాజీ ఎంపీటీసీ ఉప్పుల మల్లయ్య  పాల్గొన్నారు.