
- సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్
హైదరాబాద్, వెలుగు : మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 21.29 లక్షల సిలిండర్లను రూ.500కే అందించినట్టు సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ప్రజాపాలన ద్వారా మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి వరకు 39.33 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 18. 86 లక్షల మంది లబ్ధిదారులు సిలిండర్లను బుక్ చేసుకున్నారు. కాగా, మహాలక్ష్మి పథకం కోసం గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రూ.59.97 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది.