ఉక్రెయిన్ నుంచి ముంబైలో ల్యాండ్ అయిన విమానం

ఉక్రెయిన్ నుంచి ముంబైలో ల్యాండ్ అయిన విమానం

ఉక్రెయిన్ నుంచి 219 మంది ప్రయాణికులతో బయలుదేరిన తొలి విమానం మహారాష్ట్రలోని ముంబైలో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న వారిని కేంద్ర మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారతీయులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో ఉన్నవాళ్లంతా మంత్రిని చూడగానే జై హింద్ అంటూ నినాదాలు చేశారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న మిగిలిన భారతీయులందర్నీ కూడా క్షేమంగా భారత్‌కు తీసుకొస్తామన్నారు. ప్రధాని కూడా ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడారని చెప్పారు. రష్యా కూడా భారతీయులందర్నీక్షేమంగా పంపిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఉక్రెయిన్‌లో మీ స్నేహితులకు కూడా ధైర్యం చెప్పాలన్నారు. మరో ఫ్లైట్ ఆదివారం ఉదయం వరకు ఇండియాకు వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సిబ్బందికి కేంద్రమంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ రోజు మధ్యాహ్నం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి విమానం బయలుదేరి ఇండియాకు చేరింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో అక్కడ నుంచి భార‌త విద్యార్థుల త‌ర‌లింపు శ‌నివారం నుంచి మొద‌లైంది. 219 మందితో ఓ విమానం ఇప్ప‌టికే ముంబైకి బ‌య‌లుదేర‌గా.. మ‌రో రెండు విమానాలు బ‌య‌లుదేర‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు విమానాల్లోని భార‌తీయుల్లో 13 మంది తెలుగు విద్యార్థులున్నారు.