బీహార్‌లో విషాదం.. ఒక్కరోజులోనే నీట మునిగి 22 మంది మృతి

బీహార్‌లో విషాదం.. ఒక్కరోజులోనే నీట మునిగి 22 మంది మృతి

ఇది మహా విషాదం అని చెప్పాలి. బీహార్ రాష్ట్రంలో ఒక్కరోజే వివిధ చోట్ల జరిగిన ప్రమాదాల్లో 22 మంది వరకు చనిపోయారు. ఈ విషయాన్ని నితీష్ సర్కారే వెల్లడించింది.

ఒకే రోజు నీట మునిగి 22 మంది మరణించారు. బీహార్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకే రోజు ఈ సంఘటనలు జరిగాయి. శనివారం (అక్టోబర్ 7న) బీహార్‌లోని పలు జిల్లాల్లో నీటిలో మునిగి సుమారు 22 మంది చనిపోయారు. 

భోజ్‌పూర్‌లో ఐదుగురు, జహనాబాద్‌లో నలుగురు, పాట్నా, రోహతాస్‌లో ముగ్గురు, దర్భంగా, నవాడలో ఇద్దరు, మాధేపురా, కైమూర్, ఔరంగాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నీట మునిగి మరణించారు.

ALSO READ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం.. బస్సు కోసం ఎదురుచూస్తే ప్రాణం పోయింది

బీహార్‌లోని పలు చోట్ల ఒకే రోజు నీట మునిగి 22 మంది చనిపోవడం పట్ల సీఎం నితీశ్‌ కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. 

నీట మునిగి చనిపోయిన వారిలో 14 ఏళ్ల ఇద్దరు కవల సోదరులు కూడా ఉన్నారు.