
లింగంపేట, వెలుగు: తండ్రి వంద రూపాయలు ఇవ్వలేదని క్షణికావేశంలో ఓ యువకుడు బైక్ను తగులబెట్టి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు సోమవారం వెల్లడించారు. లింగంపేటకు చెందిన పెద్దపుల్ల వీరేశం(23) అనే యువకుడు ఆదివారం రాత్రి తన తండ్రిని రూ. వంద కావాలని అడిగాడు. అందుకు తండ్రి 50 మాత్రమే ఉన్నాయంటూ ఇవ్వడంతో క్షణికావేశానికి గురైన వీరేశం తన టూవీలర్ పై బయటికి వెళ్లిపోయాడు. వాగు దగ్గర బైకును తగలబెట్టి మామిడి చెట్టుకు ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వీరేశం బాడీని పోస్టుమార్టానికి ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.