కర్ణాటకలో ఆక్సిజన్‌ అందక 24 మంది మృతి

V6 Velugu Posted on May 03, 2021

కరోనా సెకండ్ వేవ్ తో  దేశంలో వైరస్ భారిన పడిన బాధితులు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు చనిపోతున్నారు.

కర్ణాటకలోని చామ్‌రాజ్‌ నగర్‌ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 24 మంది కరోనా రోగులు మృతి చెందారు. నిన్న అర్దరాత్రి దాదాపు 12 గంటల నుంచి రెండు గంటల మధ్యకాలంలో ఆస్పత్రిలో  ఆక్సిజన్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. పక్క జిల్లా అయిన మైసూర్‌ జిల్లా నుంచి ఈ ఆస్పత్రికి ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది.అయితే అక్కడి నుంచి ఆక్సిజన్‌ రావడం ఆలస్యం కావడంతో ఇక్కడ రోగులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో చాలా మంది యువకులేనని బంధువులు చెబుతున్నారు

 అయితే ఆస్పత్రి అధికారులు ఈ ఘటనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.  ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్‌ తెప్పించినట్లు తెలిపారు.

Tagged oxygen shortage, 24 patients die, Karnataka hospital

Latest Videos

Subscribe Now

More News