చెప్పులు జారి బోరుబావిలో పడిన 24ఏళ్ల మహిళ

చెప్పులు జారి బోరుబావిలో  పడిన 24ఏళ్ల మహిళ

ఎక్కువగా చిన్న పిల్లలు ఓపెన్ బోర్ వెల్ గుంటల్లో పడుతుండటం జరుతుంటుంది. కానీ రాజస్థాన్ లో 24 ఏళ్ల ఓ మహిళ బోరు బావిలో పడింది. అది కూడా చెప్పులు జారి పడి.. గంగాపూర్ జిల్లాలోని గుడ్ల గ్రామ పంచాయతీ రామ్ నగర్ ధోసి గ్రామంలో ఓ చేదు సంఘటన చోటు చేసుకుంది.  సురేష్ భార్య మౌనిక మంగవారం రాత్రి నుంచి కనిపించడం లేదు. ఆమె కోసం చుట్టు పక్కలా వెతికారు. అయినా మౌనిక కనిపించలేదు. బుదవారం ఉదయం 11గంటలకు ఆమె కాళ్ల చెప్పులు బోరు బావి దగ్గర పడి ఉండటాన్ని గమనించారు.

మౌనిక బోరు బావిలో జారి పడిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. NDRF, SDRF బృందాలను  పిలిపించి పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. గంగాపూర్ జిల్లా కలెక్టర్ దగ్గరుండి సహాయక చర్యలను పరిశీలిస్తున్నాడు. 


మౌనిక బోరు బావిలో పడి దాదాపు 24గంటలు కావొస్తోంది. రిస్య్కూ టీంలు మోనిక కోసం ఇంకా గాలిస్తున్నాయి. ఆమె కదలికల కోసం ఓ కెమెరాని బోర్ వెల్ లోకి పంపించి చూస్తున్నారు. ఆమెను రక్షించేందుకు రిలీఫ్ అండ్ రిస్క్యూ టీం అన్ని విధాల ప్రయత్నిస్తుందని కలెక్టర్ గౌరవ్ సైనీ మీడియాకు తెలిపారు. 24గంటల పాటు ఓ వ్యక్తి బోర్ వెల్ లో పడి ఉండటం ఇండియాలో ఇది  రెండవ సారి  గుజరాత్ జామ్ నగర్ జిల్లా గోవానా గ్రామంలో రెండేళ్ల చిన్నారిని 24 గంటల పాలు శ్రమించి రెస్క్యూ టీం , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు  సురక్షితంగా బయటకు తీశాయి.