
న్యూఢిల్లీ: పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం పటిష్ట జాగ్రత్త చర్యలు తీసుకుంది. అయితే తొలి రోజు సెషన్ సందర్భంగా చేపట్టిన టెస్టుల్లో 25 మంది ఎంపీలు కరోనా పాజిటివ్‌గా తేలడం సంచలనంగా మారింది. వీరిలో 17 మంది లోక్‌సభ ఎంపీలు, తొమ్మిది మంది రాజ్య సభ ఎంపీలు ఉన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన పాతిక మంది ఎంపీల్లో 11 మంది బీజేపీ సభ్యులని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఉన్నారని, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని తెలిసింది. వైరస్ ఇన్ఫెక్టెడ్‌గా తేలిన వారిలో సుఖ్‌బీర్ సింగ్ జౌన్‌పురియా, మీనాక్షి లేఖి, సుకాంత మజుందార్, అనంత్ కుమార్ హెగ్డే, గొడ్డెటి మాధవి, ప్రతాప్ రావ్ జాదవ్, జనార్దన్ సింగ్ సిగ్రివాల్, బిద్యుత్ బరాన్ మహాతో, ప్రదాన్ బరువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం జీ, ప్రతాప్ రావ్ పాటిల్, రామ్ శంకర్ కతేరియా, పర్వేశ్ సాహిబ్ సింగ్, సత్య పాల్ సింగ్, రొడ్మల్ నగర్ ఉన్నారని తెలుస్తోంది.