25 రాష్ట్రాల్లో పెట్రో రేట్లు డౌన్‌.. తగ్గించని తెలంగాణ సర్కారు

25 రాష్ట్రాల్లో పెట్రో రేట్లు డౌన్‌.. తగ్గించని తెలంగాణ సర్కారు

పెట్రో  ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలోని వ్యాట్ తగ్గించాయి. 10 రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గించలేదని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ ఉన్నట్టు ప్రకటించింది. 

రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడంతో లీటర్ పెట్రోల్ ధర పంజాబ్ లో 16 రూపాయల 2 పైసలు, కర్నాటకలో 13 రూపాయల 35 పైసలు, లడఖ్ లో 13 రూపాయల 43 పైసలు తగ్గింది. కర్నాటకలో లీటర్ డీజిల్ ధర 19.49 పైసలు, లడఖ్ లో 19 రూపాయల 61 పైసలు తగ్గింది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా వ్యాట్ తగ్గించకపోవడంతో లీటర్ డీజిల్ జైపూర్ లో 108 రూపాయల 39 పైసలు, విశాఖపట్నంలో 107 రూపాయల 48 పైసలు పలుకుతోంది.