కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల ఉద్యోగులు భర్తీ..

కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల ఉద్యోగులు భర్తీ..

గతంలో తెలంగాణను ఏలిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాకతీయులు నడియాడిన నేల.. అప్పటి ఓరుగల్లు.. ఈ నాటి వరంగల్ అభివృద్ది చేస్తామని ఆర్భాటంగా కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు అట్టహాసంగా ప్రారంభించింది.2016 లో  రైతుల నుంచి భూమి సేకరించి..  2017 అక్టోబర్ లో శంకుస్థాపన చేసి ... ఏడాదిలో 65 వేల మందికి ఉద్యోగాలిస్తామని ఆనాటి నేతలు మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి.2023లో అధికారం కోల్పోయే సమయం వరకు కూడా పనులు పూర్తి చేయలేదు .    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలేదని.. ఈ విధంగా పేదలను మోసం చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులపై దృష్టి సారించింది.   

గత బీఆర్ ఎస్ ప్రభుత్వం కాకతీయ టెక్స్ టైల్ పార్క్ కు భూమి ఇచ్చిన రైతులకు ఇస్తామన్న ప్లాట్లు, ఇండ్లు కేటాయించలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ పార్కులోని కంపెనీల నిర్మాణ పనులను స్పీడప్‍ చేయగా.. భూములిచ్చిన 1,398 మంది రైతుల కోసం రాజీవ్‍గాంధీ టౌన్‍షిప్‍ ఏర్పాటు చేసి అందరికీ ప్లాట్లు కేటాయించింది. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నది. పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టెక్స్ టైల్ కంపెనీ ఇప్పటికే 25 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‍ ఇచ్చింది.  

అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీకి 4,170 కోట్లు 

గత బీఆర్ఎస్ సర్కార్  గ్రేటర్‍ వరంగల్‍ అభివృద్ధి కోసం మాస్టర్‍ప్లాన్‍ తీసుకొస్తామని పదేండ్లు ఊరించింది. కాలాయాపన చేస్తే టైంపాస్ చేసింది కాని వరంగల్ అభివృద్ది గురించి పట్టించుకోలేదు.  కాంగ్రెస్‍ ప్రభుత్వం రాగానే మాస్టర్ ప్లాన్‌ ను రూపొందించడం..  ఆమోదముద్ర  వేయడం జరిగింది.  వరంగల్ సిటీలో అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మిస్తామని ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పనుల కోసం ఏకంగా రూ.4,170 కోట్లు కేటాయించారు. 2057 నాటికి పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని పనులకు శ్రీకారం చుట్టేలా అడుగులు పడ్తున్నాయి.