మన ఇంటర్నెట్‌ ప్రయాణానికి 25 ఏళ్లు

మన ఇంటర్నెట్‌ ప్రయాణానికి 25 ఏళ్లు

ప్రపంచాన్నే టెక్నాలజీ

ప్రపంచపు సరిహద్దులను చెరిపేసిన అత్యంత శక్తిమంతమైన టెక్నాలజీ ఇంటర్నెట్. 1990లో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చింది. భూమిపై ఉన్న ప్రతి మనిషి తన ద్వారా ప్రయోజనం పొందే అవకాశాన్ని కల్పించింది. ఆఫ్రికాలోని మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తి ఇండియాలోని పల్లెటూరులోని మనిషితో మాట్లాడిస్తున్నది. ఎందరినో బిలినీయర్లుగా మార్చింది. గుండు పిన్ను నుంచి అత్యంత భారీ యంత్రాలను ఆన్‌‌లైన్‌‌లో కొనేలా చేయగలుగుతోంది. ఆఫీసు పనులను మరింత ఈజీ చేసింది. ఇలా ఇంటర్నెట్ ఉపయోగాల గురించి రాయాలంటే పెద్ద పుస్తకమే అవుతుంది. గూగుల్‌, ఫేస్బుక్‌ వంటి టెక్నాలజీ కంపెనీలకు బిలియన్‌‌ డాలర్లు కురిపిస్తోం ది. మన నిత్యం జీవితంలో భాగమైన ఇంటర్నెట్ ఇండియాలో 25 ఏళ్ల మైలు రాయిని దాటింది.  25 ఏళ్ల మైలురాయిని దాటింది‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

బిజినెస్‌ డెస్క్‌ , వెలుగు: మనదేశంలో 1995, ఆగస్టు 15న అప్పటి ప్రభుత్వ రంగ సంస్థ విదేశీ సంచార్‌ నిగమ్ లిమిటెడ్‌  (వీఎస్‌ ఎన్‌ ఎస్‌ )ఇంటర్నెట్‌ సర్వీసులను మొదలుపెట్టింది. అప్పటి వరకు టైప్‌ మెషీన్లు, టెలిగ్రామ్‌‌ సర్వీసు లపైనే ఆధారపడ్డవాళ్లు ఇంటర్నెట్‌ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే ఈ టెక్నాలజీ ఇండియా దశ, దిశలను మార్చేసింది. అయితే మొదట్లో ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పొందడం చాలా కష్టమయ్యేది. డయలప్‌ కనెక్షన్‌ ద్వారా అందే నెట్‌ వేగం చాలా తక్కువగా ఉండేది. దీనికోసం పెద్దపెద్ద మెషీన్లు అమర్చేవారు. టారిఫ్‌ లు చాలా ఎక్కువ ఉండేవి. మొదట్లో 10 కేపీబీఎస్‌ దాటని ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఇప్పుడు సెకనుకు గిగాబిట్‌ స్పీడ్‌ తో దూసుకెళ్తోంది. అరచేతిలో ఇమిడిపోయే ఫోన్లలోనూ పనిచేస్తోంది. ప్రభుత్వం , ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని రంగాలకూ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 460 కోట్ల మంది నెట్‌ ను వాడుతున్నారు. నిత్యం వందల కోట్ల గిగాబైట్ల డేటా ట్రాన్స్‌‌ఫర్‌ అవుతోంది. వీడియో, ఆడియో కాలింగ్‌ వల్ల దూరంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది ఇంటర్‌ నెట్‌ . ఒక్క క్లిక్‌ తో బంధువులు, స్నేహితులు ఇప్పుడు ఆన్‌ లైన్‌ లోకి వచ్చేస్తున్నారు.

టెక్నాలజీ కంపెనీలకు డబ్బే డబ్బు

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ కార్పొరేట్‌ కంపెనీలన్నీ టెక్నాలజీ కంపెనీలే. ఏ ఒక్క సంస్థ కూడా ఇంటర్నెట్‌ లేకుండా ఎదగలేదు. ఫేస్‌ బుక్‌ , ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా కంపెనీలు నేడు మన జీవితాల్లో భాగం అయిపోయాయి. కొన్ని యాప్స్‌‌, వెబ్‌ సైట్లు పెళ్లిళ్లు కూడా చేస్తున్నాయి. స్నేహితులను వెతికి పెడుతున్నాయి. ఫ్లిప్‌ కార్ట్‌‌, అమెజాన్‌ వంటివి షాపింగ్‌ తీరునే మార్చేశాయి. క్రిప్టోకరెన్సీ లు సాధారణ కరెన్సీలకు ధీటుగా ఎదుగుతున్నాయి. కరోనా వచ్చాక నెట్ లేకుండా పూటగడవని పరిస్థితి. వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌కు, ఆన్‌ లైన్‌ క్లాసులకు, తిండికి, బట్టలకు, సరుకుల డెలివరీకి ఇంటర్‌ నెట్టే ఆధారం. ఓలా, ఉబర్‌, స్వి గ్గీ, అమెజాన్‌ , ఫ్లిప్‌ కార్ట్‌‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి వాటిని రోజుకు ఒక్కసారైనా వాడుతున్నాం. ఎన్నో స్టార్టప్‌ లు, యూనికార్న్‌‌లు, ఫిన్‌టెక్‌ కంపెనీల పుట్టుకకు ఇంటర్‌ నెట్టే ఆధారమైంది.

కొందరి చేతుల్లో బందీ అయిపోయిందా ?

నెట్‌ అందరికీ సమానంగా అందడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. కొత్త టెక్నాలజీలను కొందరు సంపన్నులు, శక్తిమంతులు హైజాక్‌ చేశారని హార్వర్డ్‌‌ లాస్కూల్‌ ప్రొఫెసర్‌ వివేక్‌ వాధ్వా అన్నారు. ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ ను కొన్ని కంపెనీలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని విమర్శించారు. ప్రతి ఒక్కరూ తమ గొంతు వినిపించే అవకాశం సోషల్‌ మీడియా ద్వారా వచ్చినప్పటికీ, అవి వ్యక్తుల సమాచారాన్ని అమ్ముకోవడం బాధాకరమని అన్నారు. వ్యక్తులపై చెడు ప్రచారానికి, నకిలీ వార్తలను వ్యాపింప జేయడానికీ వీటిని వాడుకుంటు న్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వాలు వీటిపై కంట్రోల్‌ ఉండాలని వాదిస్తున్నాయి. డేటా సెంటర్లను స్థానికంగానే ఏర్పాటు చేయాలని స్పష్టం చేస్తున్నాయి.

కొన్ని విశేషాలు

ఇండియాలో 1995లో ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. అప్పుడు నెలకు 250 గంటలపాటు నెట్‌ వాడుకోవడానికి రూ.15 వేలు చెల్లించాల్సి వచ్చేది. స్పీడ్‌ కేవలం 9.8 కేపీబీఎస్‌. ఇది కనీసం 2జీ స్పీడ్‌ కూడా కాదు.

ఇండియాలో ఇప్పుడు 20 రూపాయలకు 4జీ స్పీడ్‌ తో 20జీబీ డేటా వస్తోంది. మనదేశంలో ఇప్పుడు 60 కోట్ల మంది నెట్‌ యూజర్లు ఉన్నారు. నెట్‌ వాడకంలో ప్రపంచంలోనే మనది రెండో స్థానం. ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ ఉన్న టాప్‌ –5 కంపెనీలు మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ , గూగుల్‌ ,ఆపిల్‌ , ఫేస్‌ బుక్‌ లు. మైక్రోసాఫ్ట్‌‌ కూడా 1995లోనే ఏర్పడింది.

కరోనా వచ్చాక ఆన్‌ లైన్ ఎడ్యుకేషన్‌ కు డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు సహా అన్ని విద్యాసంస్థలు డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఐఐటీ–మద్రాస్‌ ఆన్‌ లైన్‌ బీఎస్సీ కోర్సును లాంఛ్‌ చేసింది.

ఇంటర్నెట్‌ యూజర్ల డేటాకు మరిం త సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎక్స్‌‌పర్టులు సూచిస్తున్నారు. ఇండియన్‌ ఇంటర్నెట్‌ ఎంటర్‌ ప్రెనూర్లకు సమాన అవకాశాలు దక్కడం లేదని, పెద్ద కంపెనీలే లాభపడుతున్నాయనే విమర్శలూ ఉన్నాయి.

మత సంబంధిత కార్యక్రమాలనూ ఇంటర్నెట్టే చేసేస్తోంది. ఆన్‌ లైన్‌ లో పూజలు, కర్మకాండలు చేసే విధానాలను తీసుకొచ్చింది. ఆన్‌ లైన్‌ లో పెళ్లిళ్లు, ఎంగేజ్‌ మెంట్లు కూడా జరుగుతున్నాయి.

భవిష్యత్ఎలా ఉంటుందంటే

ఆర్టిఫి షియల్‌ ఇంటెలిజెన్స్‌‌, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా ఎనలిటిక్స్‌‌ వంటివి ఇంటర్నెట్‌ ను మరింత శక్తిమంతంగా మార్చుతున్నాయి. హోలోగ్రాఫిక్‌, ఆగ్‌ మెంటెడ్‌ రియాల్టీ వంటి సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాయి. ఎంత పెద్ద డేటాబేస్‌ అయినా క్షణాల్లో అందులోని సమాచారాన్ని తవ్వితీస్తున్నాయి. అమెరికా ఎన్నకల ప్రచారం ఎక్కువగా ఆన్‌ లైన్‌ లోనే జరుగుతున్నదంటే ఇంటర్నెట్‌ ఎంత శక్తిమంతమైనదో అర్థం చేసుకోవచ్చు. డేటాను కంట్రోల్‌ చేయడానికి కార్పొరేట్లు, ప్రభుత్వాల మధ్య డిజిటల్ వార్‌ జరుగుతుందని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో నెట్‌ ద్వారా మరెన్నో అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని, అవేంటో ఇప్పుడే చెప్పడం కష్టమని పేర్కొన్నారు.