సింగరేణిలో 11 ఏరియాల నుంచి 26 మంది బెస్ట్​ ఆఫీసర్లు, సింగరేణీయన్లు ఎంపిక

సింగరేణిలో 11 ఏరియాల నుంచి 26 మంది బెస్ట్​ ఆఫీసర్లు, సింగరేణీయన్లు ఎంపిక

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : రిపబ్లిక్​ డే సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా బెస్ట్ ఆఫీసర్స్, బెస్ట్​ సింగరేణీయన్లను ఎంపిక చేశామని కంపెనీ జీఎం పర్సనల్​ కె. బసవయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  11 ఏరియాల నుంచి 13 మంది ఉత్తమ అధికారులు, 13 మంది ఉత్తమ సింగరేణీయన్లను ఎంపిక చేశామని ఆయన చెప్పారు. వారిని కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే రిపబ్లిక్​ వేడుకల్లో సీఎండీ, డైరెక్టర్లు సన్మానిస్తారని వెల్లడించారు.

బెస్ట్​ ఆఫీసర్లు

హైదరాబాద్​ సింగరేణి భవన్​ జీఎం ఎం.సురేశ్, కొత్తగూడెం కార్పోరేట్​ ఆఫీస్​కు చెందిన జీఎం పర్సనల్​ కె.బసవయ్య, కొత్తగూడెంలోని పీవీకే 5 ఇంక్లైన్​లో డీవైఎస్ఈగా పనిచేస్తున్న సీహెచ్  శ్రీనివాసరావు, ఇల్లెందు ఏరియా స్టోర్​ఈఈ బోడా నాగేశ్వరరావు, మణుగూరు ఏరియా ఎస్ఈగా పనిచేస్తున్న సీహెచ్  శ్రీనివాస్​రెడ్డి, ఆర్జీ1 ఏరియా లో జీడీకే మైన్​ మేనేజర్ గా పనిచేస్తున్న అనిల్​ గబలే, ఆర్జీ2 ఏరియా జీడీకే ఓసీ3లో అడిషనల్​ మేనేజర్​ గా పనిచేస్తున్న ఆర్.రమేశ్, ఆర్జీ3 ఏరియాలో డీజీఎంగా వ్యవహరిస్తున్న ఎం.కాశీ విశ్వేశ్వరరావు, అడ్రియాలలో ఎస్ఓఎంగా పనిచేస్తున్న కె. జనార్దన్, బెల్లంపల్లిలో ఏజీఎంగా ఉన్న ఎం.తిరుమలరావు, మందమర్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న జె.నాగరాజు, శ్రీరాంపూర్​లో డీవైఎస్ఈగా వ్యవహరిస్తున్న సంపత్​, ఎస్టీపీపీలో ఏజీఎంగా పనిచేస్తున్న కె.సత్యనారాయణ ఎంపికయ్యారు.

ఉత్తమ సింగరేణీయన్లు

కొత్తగూడెం ఏరియాలో  ఫోర్​మెన్​ ఇన్ చార్జిగా పనిచేస్తున్న కోలాహలం నరసింహరాజు, ఇల్లెందు ఏరియా జేకే5 ఓసీలో ఈపీ ఆపరేటర్​ యదుభూషణ్​ కుమార్​ సింగ్, మణుగూరు ఏరియాలో కన్వేయర్​ ఆపరేటర్​ సుందర్​ రాజన్​ నల్లమ్, శ్రీరాంపూర్​ ఏరియాలో కోల్​ కట్టర్​ ఎం.మధుకర్, మందమర్రి ఏరియాలో జనరల్​ మజ్దూర్​ కుమ్మరి జెస్సీ రాజ్, బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడలో ఈపీ ఆపరేటర్​గొల్ల కృష్ణ, ఆర్జీ1 ఏరియాలో ఆపరేటర్​పి. భగవాన్​రెడ్డి, ఆర్జీ2 ఏరియాలో ఈపీ ఆపరేటర్​ రాజాలి, ఆర్జీ3 ఏరియాలో ఈపీ ఆపరేటర్​ప్రకాశ్​ లాల్​ శర్మ, భూపాలపల్లి ఏరియాలో సర్వేయర్​ కవిటి రమేశ్, ఎస్టీపీపీలో జూనియర్​ అకౌంటెంట్​ దూత రాయమల్లు.