ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

 ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం వర్చువల్ గా జరిగిన కేబినెట్ భేటీలో 26 కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. ఈనెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభం కానుంది. 

73కి పెరిగిన రెవెన్యూ డివిజన్లు
కొత్తగా ఏర్పాటు కానున్న 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దం చేసిన అధికారులు.. ఈ  ప్రక్రియలో పలు మండలాలను మార్చారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. 

జిల్లాల వారీగా ఏర్పాటు కానున్న కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా ఉన్నాయి

అనంతపురం జిల్లా : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

వైఎస్ ఆర్ కడప జిల్లా : బద్వేల్, కడప, జమ్మలమడుగు

అన్నమయ్య జిల్లా : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

చిత్తూరు జిల్లా : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

తిరుపతి జిల్లా : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి. 

నెల్లూరు జిల్లా : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

కర్నూలు జిల్లా: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

నంద్యాల జిల్లా : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల 

 ప్రకాశం జిల్లా : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

విజయనగరం జిల్లా : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

ప్వార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం, పాలకొండ

అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు, రంపచోడవరం

విశాఖపట్నం జిల్లా : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

అనకాపల్లి జిల్లా: అనకాపల్లి, నర్సీపట్నం, 

కాకినాడ జిల్లా: పెద్దాపురం, కాకినాడ

కోనసీమ జిల్లా : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

తూర్పుగోదావరి జిల్లా : రాజమహేంద్రవరం, కొవ్వూరు

పశ్చిమగోదావరి జిల్లా : నర్సాపురం, భీమవరం (కొత్త)

ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

కృష్ణా జిల్లా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

ఎన్టీఆర్‌ జిల్లా : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

గుంటూరు జిల్లా : గుంటూరు, తెనాలి

బాపట్ల జిల్లా : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

పల్నాడు జిల్లా : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

 

 

ఇవి కూడా చదవండి

రేపట్నుంచి రంజాన్ మాసం షురూ

చండీఘఢ్ను పంజాబ్కు ఎలా బదిలీ చేస్తారు?

వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు