పాలమూరులో 26 మంది, 43 సెట్లు దాఖలు

పాలమూరులో 26 మంది, 43 సెట్లు దాఖలు
  • ముగిసిన నామినేషన్ల పర్వం
  • నాగర్​కర్నూల్​లో 34 మంది, 53 నామినేషన్ సెట్లు దాఖలు

మహబూబ్​నగర్, వెలుగు: లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నామినేషన్​ స్వీకరణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. మహబూబ్​నగర్​ పార్లమెంట్ స్థానానికి 26 మంది క్యాండిడేట్లు 43 సెట్ల నామినేషన్లు​దాఖలు చేయగా, నాగర్​కర్నూల్​లో 34 మంది అభ్యర్థులు 53 సెట్ల నామినేషన్లు వేశారు. శుక్రవారం స్ర్కూటిని నిర్వహంచనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహకరణకు టైమ్  ఇచ్చారు.

నామినేషన్లు దాఖలు చేసింది వీరే..

నామినేషన్ల స్వీకరణ మొదటి రోజే ఎంపీ లక్ష్మణ్​తో బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఆమె తరపున మరో రెండు సెట్ల నామినేషన్లు ఫైల్​ చేశారు. దీంతో మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్​ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి ఈ నెల 19న రెండు సెట్ల నామినేషన్లు​ఫైల్​ చేయగా, కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి అటెండ్​ అయ్యారు. 22న ఆయన తరపున మరో సెట్​ నామినేషన్​ ఫైల్​ చేశారు. దీంతో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు​చేశారు. 

19న సిట్టింగ్​ ఎంపీ, బీఆర్ఎస్​ క్యాండిడేట్​ మన్నె శ్రీనివాస్​ రెడ్డి తరపున ఒక సెట్​ నామినేషన్​ను దాఖలు చేయగా, చివరి రోజు ఎంపీ మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్​గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డి, ఎస్.రాజేందర్​ రెడ్డి, చిట్టెం రాంమోహన్​ రెడ్డితో కలిసి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లైంది. 

బీఎస్పీ నుంచి మహ్మద్​ అలావుద్దీన్, ఏఐఎంఐఎం నుంచి షేక్​ బాషా, బహుజన్​ ముక్తి పార్టీ నుంచి రహ్మాన్, తెలంగాణ జాగీర్​ పార్టీ నుంచి ఎన్​ నరేశ్​ రెడ్డి, సోషల్​ జస్టిస్​ పార్టీ నుంచి బి.రవీందర్​, విడుతలై చిరుతైగల్​ కచ్చి (వీఎస్కే) పార్టీ నుంచి కె.శంకర్​రెడ్డి ఒక్కోసెట్​ చొప్పున, ధర్మ సమాజ్​ పార్టీ నుంచి జి.రాకేశ్​ మూడు సెట్ల నామినేషన్లు ఫైల్​ చేశారు. ఇండిపెండెంట్​ క్యాండిడేట్లుగా ఇంతియాజ్, ఉమాశంకర్, కె.హనుమేశ్, వి.గోవిందమ్మ, వెంకటరమణ, సబావత్​ శ్రీనివాస్, పి.సందీప్​ కుమార్​ రెడ్డి, గంబావత్​ దినేశ్, సబావత్​ విజయ, నడిమింటి శ్రీనివాసులు ఒక్కో సెట్​ చొప్పున, మల్లెల హరీందర్ రెడ్డి, కారుకొండ శ్రీనివాసులు, సత్యనారాయణ, ఎస్​.సరోజమ్మ, టి.విష్ణువర్ధన్​రెడ్డి రెండు సెట్ల చొప్పున, కె.రామలింగప్ప మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

చివరి రోజు జోరుగా..

నాగర్ కర్నూల్: నాగర్​కర్నూల్​లో 34 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు గురువారం 19 మంది అభ్యర్థులు 30 నామినేషన్లు వేయగా, రాత్రి 8 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.చివరి రోజు బీజేపీ క్యాండిడేట్​ పోతుగంటి భరత్ ప్రసాద్, బీఎస్పీ నుంచి మంద జగన్నాథ్, బీసమోల్ల యూసుఫ్, ఇండిపెండెంట్లు నామినేషన్లు అందజేశారు. 

యూసీసీఆర్ఐ తరపున బుద్దుల శ్రీనివాసులు, బీఎల్ఎఫ్​ అభ్యర్థిగా పంబలి రామస్వామి, బీఎంపీ నుంచి గడ్డం విజయ్​కుమార్, జై భారత్​ పార్టీ నుంచి గుండె రమేశ్ చంద్ర, ఇండిపెండెంట్లుగా​పులిజాల బాలయ్య, నేడిగొండ కృష్ణయ్య, గాలిముడి గీత, చిన్నపాక రాములు, బాకీ బాలరాజు, భారతి దాసరి, మాల దిలీప్​ కుమార్, నక్క పాపయ్య, టి.ప్రభుదాస్, గడుసు అరుణ్​కుమార్, లంద భిక్షపతి, ఆర్పీపీ​తరపున అయ్యప్ప సునీల్, పకీర రాములు నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్​ క్యాండిడేట్​ ఆర్ఎస్పీ తరపున కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్, బీఆర్ఎస్​ లీడర్లు రంగినేని అభిలాశ్​రావు నామినేషన్​ అందించారు. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ మంది రావడంతో 3 గంటల వరకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు.