ప్ర‌త్యేక విమానంలో బ్రిట‌న్ కు 270 మంది

ప్ర‌త్యేక విమానంలో బ్రిట‌న్ కు 270 మంది

అమృత్ స‌ర్ : చాలా రోజులుగా లాక్ డౌన్ తో ఇబ్బందిప‌డుతున్న వారిని కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌స్థ‌లాల‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్ర‌త్యేక రైళ్లు, విమాన సర్వీసుల‌ను న‌డిపిస్తోంది. పంజాబ్ లో అమృత్ ‌స‌ర్ లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి 270 బ్రిట‌న్ వాసులు ఖ‌తార్ ఎయిర్ వేస్ ప్ర‌త్యేక విమానంలో త‌మ దేశానికి బ‌య‌లుదేరి వెళ్లారు.

ఎయిర్ పోర్టు సిబ్బంది బ్రిట‌న్ వాసులంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌ వారిని విమానంలో స్వ‌స్థ‌లాల‌కు పంపించింది. లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా చాలా మంది వివిధ రాష్ట్రాల్లో చిక్కుకునిపోయిన విష‌యం తెలిసిందే.