భద్రాచలం, వెలుగు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.89 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో 19 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఒక డీసీఎం, ఒక పీపీసీఎం, ఆరుగురు ఏరియా కమిటీ మెంబర్లు, నలుగురు మిలటరీ సభ్యులు, 10 మంది పార్టీ సభ్యులు, ఆరుగురు మెంబర్స్ లొంగిపోయిన వారిలో ఉన్నారు.
వీరందరికీ ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని బస్తర్ ఐజీ సుందర్రాజ్ పి తెలిపారు. ముగ్గురు మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, 303 రైఫిల్స్ అప్పగించారని చెప్పారు. లొంగిపోయిన వారంతా మాడ్ డివిజన్, ఆమ్దాయి, బాయనార్, పరతాపూర్, ఉత్తర బస్తర్ బ్యూరో, కుతుల్ ఏరియా కమిటీలకు చెందిన వారని తెలిపారు.
