ఏడీఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ కేబినెట్లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. అందులో 19 మందిపై హత్యాయత్నం, మహిళలపై నేరాలు, ద్వేషపూరిత ప్రసంగాలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని పేర్కొంది.
ఇద్దరు మంత్రులు అత్యంత తీవ్రమైన హత్యాయత్నానికి సంబంధించిన కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. వారే ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్, ఈశాన్య ప్రాంత విద్య, అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ అని ఏడీఆర్ వెల్లడించింది.