బెంగళూరుపై ఒమిక్రాన్ పంజా

బెంగళూరుపై ఒమిక్రాన్ పంజా

బెంగళూరు : కర్నాటకలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బెంగళూరులో ఎక్కువ మంది వైరస్ బారినపడుతున్నారు. నగరంలో ఒక్కరోజే 287 మందికి ఒమిక్రాన్ నిర్థారణ అయింది. వీటితో కలుపుకొని కర్నాటకలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ప్రకటించారు. కర్నాటకలో ఆదివారం 34,047 మంది కొవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.29శాతంగా ఉంది. కర్నాటకలో ప్రస్తుతం 1,97,982 యాక్టివ్ కేసులున్నాయి. 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఆంక్షలు మరింత కఠినం చేశారు. నగరంలో ర్యాలీలు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే పెళ్లిళ్లకు 200 మంది, ఫంక్షన్ హాళ్లలో జరిగే వివాహాలకు హాజరయ్యే వారి సంఖ్య 100కు పరిమితం చేసింది. జనవరి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

గాంధీలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా!