చెలరేగిన బౌలర్లు.. భారత్ సిరీస్ కైవసం

చెలరేగిన బౌలర్లు.. భారత్ సిరీస్ కైవసం

బర్మింగ్‌హామ్‌: టీ20 సిరీస్లో భాగంగా శనివారం ఇంగ్లండ్తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో టీమిండియా గ్రేట్ విక్టరీ కొట్టింది. 49 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. భారత్ కు మంచి స్టార్ట్ దక్కింది. హిట్ మ్యాన్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 రన్స్ చేశారు. ఆ తర్వాత వెంటనే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఆదుకుంటారనుకున్న హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్ కే ఔట్ కావడంతో 89/5 పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా ఔట్ .. దీంతో కనీసం టీమిండియా కనీసం 150 రన్స్ అయినా చేస్తుందా అనుకునే సమయంలో ఆల్ రౌండర్ జడేజా(46 నాటౌట్) ఆచితూచి ఆడుతూ భారత్ కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ప్రారంభంలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్కే రాయ్‌ డకౌట్‌ అయ్యాడు. అదే కాన్ఫిడెంట్ తో భారత బౌలర్లు రెచ్చిపోయారు. భువి, బుమ్రా, పాండ్యా, చాహల్, హర్షల్ పటేల్ ఒకరికి మించి ఒకరు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్లేయర్లు ఏ మాత్రం రాణించలేకపోయారు. కట్టుదిట్టమైన బౌలింగ్ కు టపటపా వికెట్లు సమర్పించుకున్న ఇంగ్లండ్ 121కే కుప్ప కూలింది. దీంతో 2-0 లీడ్ తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు,బుమ్రా, చాహల్‌ చెరో రెండు వికెట్లు సాధించగా.. హార్ధిక్‌ పాండ్యా, హర్షల్‌ పటేల్‌ తలా ఒక్క వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో మోయిన్‌ అలీ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.