
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో అశ్విన్ రామ్ రూపొందించిన చిత్రం ‘డార్లింగ్’. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. ‘వై దిస్ కొలవెరి’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు పాటలతో ఇంప్రెస్ చేసిన టీమ్.. శుక్రవారం మూడో పాటను విడుదల చేసింది. లవ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో ప్రియదర్శి, నభా నటేష్ జోడీ మెస్మరైజ్ చేస్తోంది.
సున్ చలియా.. గడవదు నిను చూడక నిమిషమిక.. ఓ సావరియా.. నువ్వుంటే సమయం తెలియదిక..’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్‌ను అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన విధానం ఆకట్టుకుంది. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.