బాన్సువాడలో రూ.30 లక్షలు చోరీ

బాన్సువాడలో రూ.30 లక్షలు చోరీ

బాన్సువాడ లో భారీ చోరీ
బంగారం, ల్యాప్​ట్యాప్, సెల్​ఫోన్లు ముట్టుకోని దొంగలు​


బాన్సువాడ : బాన్సువాడలోని చైతన్య కాలనీలో ఇంట్లో సుమారు 30 లక్షలు పెట్టి తాళం వేసి వెళ్లగా...టెక్నిక్​తో తాళం తీసి డబ్బులను ఎత్తుకెళ్లారు దొంగలు. కానీ, ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువులను ముట్టుకోలేదు. దీంతో తెలిసిన వారు గాని, లేకపోతే డబ్బులు పెడుతుంటే చూసిన వారు గాని చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ రాజశేఖర్​రెడ్డి కథనం ప్రకారం..చైతన్య కాలనీలో ఉండే రిటైర్డ్ పీజీ హెచ్ఎం వీరగంధం నాగేశ్వరరావు అల్లుడైన రాము ఆంధ్రప్రదేశ్​లో భూమి అమ్మాడు. రూ.29 లక్షల 40 వేలను నాగేశ్వర్​రావుకు ఇచ్చాడు. సోమవారం ఉదయం ఎక్లాస్​పూర్​లో ఫంక్షన్​కు వెళ్లాల్సి ఉండడంతో నాగేశ్వర్​రావు డబ్బులను ఒక బ్యాగులో పెట్టి ఇంట్లోని బెడ్ రూమ్ సెల్ఫ్ లో పెట్టాడు.

దానికి అడ్డుగా ఓ పాత పరుపు ఉంచాడు. డబ్బులను బీరువాలో పెడితే దొంగలు వచ్చి డైరెక్ట్ ​బీరువా తెరిచి ఎత్తుకుపోతారని, ఓపెన్​గా పెడితే వారి దృష్టి అక్కడికి వెళ్లదని నాగేశ్వర్​రావు భావించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఇంటికి తాళం వేసి భార్య, బిడ్డ, అల్లుడితో కలిసి శుభకార్యానికి వెళ్లారు. రాత్రి10 గంటలకు వచ్చేసరికి తాళం తీసి తలుపు దగ్గరకు వేసి ఉంది. దీంతో కంగారు పడుతూ డబ్బులు పెట్టిన చోటికి వెళ్లి చూడగా ఖాళీ బ్యాగ్ ​కనిపించింది. కానీ దొంగలు ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, సెల్ ఫోన్లు, లాప్ ట్యాప్​ ముట్టుకోలేదు.

మరిన్ని వార్తల కోసం : -

కర్నాటకలో భారీ చోరీ కేసును చేధించిన పోలీసులురైల్వే స్టేషన్ వద్ద చోరీలు.. దొంగ ఎవరంటే..