రాష్ట్రంలో ఐదేండ్లలో 3,055 మంది రైతులు సూసైడ్

రాష్ట్రంలో ఐదేండ్లలో 3,055 మంది రైతులు సూసైడ్

రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం

గడిచిన ఐదేండ్లలో (2017-21) తెలంగాణలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2018-19లో అత్యధికంగా 1,746 మంది సూసైడ్ ​చేసుకున్నట్లు తెలిపింది.

న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. గడిచిన ఐదేండ్లలో (2017–21) తెలంగాణలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2018–19లో అత్యధికంగా 1,746 మంది సూసైడ్​చేసుకున్నట్లు తెలిపింది. 2017లో 846 మంది, 2018 లో 900, 2019 లో 491, 2020లో 466, 2021లో 352 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎంపీ సంతోష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర  వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌ తోమర్‌‌‌‌‌‌‌‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే, అదే సమయంలో పక్క రాష్ట్రమైన ఏపీలో తక్కువ ఆత్మహత్యలు నమోదైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అక్కడ 2,413 మంది రైతులు సూసైడ్​చేసుకున్నారని పేర్కొన్నారు. కాగా, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో గడిచిన ఐదేండ్లలో 398 సూసైడ్స్ నమోదయ్యాయి. 2017 లో 110, 2018లో 80, 2019లో 108, 2020లో 87, 2021లో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఐదేండ్లలో 28,572 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు. కాగా, కేంద్రం రైతుల సంక్షేమం కోసం 19 స్కీమ్​లు ఆమోదించి అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.