32 లక్షలు దాటిన కేసులు..59 వేలు దాటిన మరణాలు

32 లక్షలు దాటిన కేసులు..59 వేలు దాటిన మరణాలు

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రతి రోజు 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.  నిన్న ఒక్కరోజే 67,151 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో కరోనా కేసుల సంఖ్య  32 ,34,475 కు చేరింది. మరో 1059 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 59,449 కు చేరింది. 24,67,779 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 7,07,267 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్క  రోజే దేశ వ్యాప్తంగా 8,23,992 మందికి టెస్టులు చేశారు. దీంతో దేశంలో ఆగస్టు 25 నాటికి టెస్టుల సంఖ్య3,76,51,512 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.