జగిత్యాల జిల్లా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,214 కేసులు పరిష్కారం : రత్న పద్మావతి

జగిత్యాల జిల్లా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,214 కేసులు పరిష్కారం :  రత్న పద్మావతి
  • జిల్లా జడ్జి రత్న పద్మావతి

జగిత్యాల టౌన్, వెలుగు: ఈనెల 13న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,214 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా జడ్జి రత్న పద్మావతి అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడానికి బార్ అసోసియేషన్, పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశారని, రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. అనంతరం పోలీసు అధికారులు, బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బందికి  ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, అదనపు జిల్లా జడ్జి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.