ఏపీ కోర్టుల్లో 3,673 పోస్టులు​

ఏపీ కోర్టుల్లో 3,673 పోస్టులు​

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్‌‌లైన్​లో అప్లికేషన్స్​ కోరుతోంది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌‌ల ద్వారా 3,673 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్‌‌ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ హైకోర్టు వేర్వేరు ప్రకటనలు జారీ చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నోటిఫికేషన్‌‌ ప్రకారం విడివిడిగా అప్లై చేసుకోవాలి.

అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్‌‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్‌‌రైటింగ్‌‌/ స్టెనో సర్టిఫికెట్‌‌, కంప్యూటర్‌‌ నాలెడ్జ్​, డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌ ఉండాలి. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్​:  పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైకోర్టు ఖాళీలకు నవంబర్​15, జిల్లా కోర్టులకు నవంబర్​ 11 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.hc.ap.nic.in వెబ్​సైట్​ సంప్రదించాలి.