జూరాల ప్రాజెక్టు 37 గేట్లు ఓపెన్

జూరాల ప్రాజెక్టు 37 గేట్లు ఓపెన్

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం ప్రాజెక్టు వద్ద 316.790 మీటర్ల లెవెల్  నీటిని నిల్వ ఉంచుకొని, 37 గేట్లు ఓపెన్  చేసి నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 3,66,952 క్యూసెక్కులు, రైట్  కెనాల్  ద్వారా 430 క్యూసెక్కులు, లెఫ్ట్  కెనాల్  ద్వారా 550 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 3,67,969 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 3.59 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది.