భారతీయులను వెనక్కి తెచ్చేందుకు 19 ఫ్లైట్లు

భారతీయులను వెనక్కి తెచ్చేందుకు 19 ఫ్లైట్లు

ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తెచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగ ముమ్మరంగా కొనసాగుతోంది. వీలైనంత తొందరగా విద్యార్థులను భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉక్రెయిన్ నుంచి ఇండియన్లను వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ గంగలో భాగంగా ఇవాళ వివిధ దేశాల నుంచి 19 విమానాల ద్వారా 3,726మందిని తీసుకురానున్నట్లు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించారు. రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి 8 విమానాలు రానుండగా.. సుసెవా నుంచి 2, కోసిస్ నుంచి 1, బుడాపెస్ట్ నుంచి 5, పోలాండ్ నుంచి 3 ఫ్లైట్ల ద్వారా ఇండియన్ స్టూడెంట్స్ను భారత్కు తీసుకురానున్నారు.

మరిన్ని వార్తల కోసం..

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరంట్స్