తెలంగాణ ఆర్టీసీకి రూ.375 కోట్లు ట్రాన్స్ పోర్ట్

తెలంగాణ ఆర్టీసీకి  రూ.375 కోట్లు ట్రాన్స్ పోర్ట్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి బడ్జెట్​లో కేటాయించిన రూ.375 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్​మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు . 2023–24  బడ్జెట్​లో కేటాయించిన నిధులకు అనుగుణంగా వీటిని  విడుదల చేశారు. కాగా, ఇవి మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించిన సబ్సిడీ నిధులు అని అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకోండి

కేబినెట్​లో ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, ట్రాన్స్​పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్​ను ఆర్టీసీ టీజేఎంయూ, ఎన్​ఎంయూ నేతలు హన్మంతు ముదిరాజ్, కమాల్ రెడ్డి, నరేందర్​ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బడ్జెట్​లో ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు కేటాయించాలని, కార్మికులకు పెండింగ్​లో ఉన్న పీఆర్సీ, డీఏ, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల్లోపే వీటిని నెరవేర్చాలని కోరారు.