SBIలో 3850 సర్కిల్ బేస్డ్‌ ఆఫీసర్ పోస్టులు

SBIలో 3850 సర్కిల్ బేస్డ్‌ ఆఫీసర్ పోస్టులు

స్టేట్‌‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోనిఎనిమిది సర్కిళ్ల‌లో మొత్తం 3వేల‌ 850 ఖాళీలు ఉన్నాయి. ఏరాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అక్కడే అప్లై చేసుకోవాలి. హైదరాబాద్‌ సర్కిల్‌‌లో 550 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేయడానికి చివరి తేది ఆగస్టు 16.
ఎలిజిబులిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అరత్హ కలిగి ఉండాలి. 2020 ఆగస్టు 01 నాటికి కనీసం రెండేండ్ల పాటు ఏదైనా షెడ్యూల్డ్‌‌ కమర్షియర్షి ల్‌‌ బ్యాంక్‌‌ లేదా రీజినల్‌‌ రూరల్ బ్యాంక్‌‌లో ఆఫీసర్‌‌‌‌గా పనిచేసి ఉండాలి. స్థానిక భాషలో టెన్త్ లేదా ఇంటర్ చదివి ఉండాలి. (గతంలో బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లు బకాయి ఉన్న వాళ్లు, సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి డిఫాల్ట్ ఉన్నవాళ్లు పోస్టుకు అనర్హులు ) 2020,ఆగస్టు 1 నాటికి వయసు 30 ఏండ్లు మించ రాదు. (ఎస్సీ,ఎస్టీ, బీసీ,వికలాంగులకు వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది)

సెలెక్షన్ ప్రాసెస్‌‌

షార్ట్‌ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష నిర్వహించే హక్కు బ్యాంక్‌‌కు ఉంది. బ్యాంక్ ఏర్పాటు చేసిన
కమిటీ షార్ట్‌‌లిస్టిం గ్ చేస్తుంది. ఆ తరువాత, బ్యాంక్ నిర్ణ‌యించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో పొందిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులు కట్–ఆఫ్ మార్కులు స్కోర్ చేస్తే వారి వయస్సు ప్రకారం ర్యాంక్ తీస్తారు. ప్రతి స్టేజ్‌లో బ్యాంక్ వారిదే తుది నిర్ణ‌యం ఉంటుంది. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత సర్కిల్ బేస్డ్‌‌ ఆఫీసర్‌‌‌‌గా ఉద్యోగంలో నియమిస్తారు.

వేతనం:రూ.23,700– 42,020
అప్లికేషన్ చివరి తేదీ: ఆగస్టు16
ఫీజు: జనరల్‌‌,ఈడబ్ల్యూఎస్‌‌, ఓబీసీలకు రూ.750/–
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌‌సీలకు మినహాయింపు
ఆన్‌‌లైన్‌‌లోఆప్లైచేయాలి. వెబ్‌‌సైట్‌‌:www.sbi.co.in/web/careers/

ఖాళీలు
హైదరాబాద్ 550
అహ్మదాబాద్‌ 750
బెంగళూరు 750
భోపాల్‌ 400
(ఎంపీ–296,ఛత్తీస్‌గఢ్‌–104)
చెన్నై 550
జైపూర్‌‌ 300
మహారాష్ట్ర(ముంబైమినహా) 517
గోవా 33

మ‌రిన్ని వార్త‌ల కోసం..