39 స్కూళ్లకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం

39 స్కూళ్లకు స్వచ్ఛ  విద్యాలయ పురస్కారం

న్యూఢిల్లీ: దేశంలోని 39 స్కూళ్లకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్2021–22  అవార్డు లభించినట్లు కేంద్ర విద్యాశాఖ శనివారం ప్రకటించింది. అవార్డు కోసం మొత్తం 8.23 లక్షల స్కూళ్లు అప్లై చేయగా.. 39 సెలక్ట్ అయినట్లు పేర్కొంది. అందులో 28 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు కాగా.. 11 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయని తెలిపింది. వీటిలో 2 కస్తూర్బా గాంధీ, ఒక నవోదయ, 3 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.

మరుగుదొడ్లు, వాటర్, శానిటేషన్, పరిశుభ్రత వంటి అంశాల్లో ఆదర్శంగా నిలిచిన స్కూళ్లకు ఈ పురస్కారం అందిస్తారు. వాటికి మెరుగులు దిద్దడానికి రోడ్‌‌ మ్యాప్‌‌ అందజేస్తారు. 17 ఎలిమెంటరీ, 22 హయ్యర్ సెకండరీ స్కూళ్లకు అవార్డు రాగా.. ఓవరాల్ కేటగిరీలో 34 స్కూళ్లకు రూ.60 వేలు, సబ్ కేటగిరీ స్కూళ్లకు రూ.20 వేల నగదు బహుమతి అందించారు.