ఎఫ్ బీ, ఇన్ స్టా లో 3డీ అవతార్ లు

ఎఫ్ బీ, ఇన్ స్టా లో 3డీ అవతార్ లు

కొంగొత్త ఫీచర్లతో నెటిజన్లకు చేరువయ్యే ప్రయత్నాల్లో ఫేస్ బుక్ (మెటా) నిమగ్నమైంది. ఈక్రమంలో తొలిసారిగా  3డీ అవతార్ లను ఇన్ స్టాగ్రామ్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ బుక్, మెసెంజర్ యాప్ ల కోసం కూడా 3డీ అవతార్ లను కూడా అప్ డేట్ చేసింది. దీంతో  ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 3డీ అవతార్ ల సంఖ్య మరింత పెరిగింది. పిల్లలు, యువతులు, యువకులు, నడి వయస్కులు, వృద్ధులు, దివ్యాంగులు, అంధులు, బధిరులు ఇలా ప్రతీ వర్గం ప్రజల ఆహార్యాన్ని అద్దం పట్టేలా ఉండటం 3డీ అవతార్ ల ప్రత్యేకత. ఫేస్ బుక్, ఇన్ స్టా, మెసెంజర్ వినియోగదారులు ఇక అచ్చం తమలా కనిపించే 3డీ అవతార్ ను ఎంపిక చేసుకోవడమే తరువాయి. ఒక అవతార్ ను క్రియేట్ చేసుకుంటే.. దాన్ని ఫేస్ బుక్ కు చెందిన మూడు ప్లాట్ ఫామ్ లపైనా వాడుకోవచ్చు. 3డీ అవతార్ లను స్టేటస్ గా, స్టోరీస్ గా కూడా పెట్టుకోవచ్చు. 

ఫేస్ బుక్ లో 3డీ అవతార్ ఇలా.. 

  • ఫేస్  బుక్ యాప్ ను తెరిచి, ‘మెనూ’ సెక్షన్ లోకి వెళ్లండి. అందులో మీకు ‘అవతార్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే.. ‘ఎడిట్ యువర్ అవతార్’ అనే ఆప్షన్ వస్తుంది.
  • ఆ వెంటనే మీ ముందు అవతార్ ను మీ ఆహార్యానికి అనుగుణంగా మార్చుకునే ఆప్షన్ ప్రత్యక్షమవుతాయి.
  • భిన్న విభిన్న డ్రెస్సులు, ముఖ కవళికలు, కనుబొమ్మలు, కేశధారణ శైలిలు కనిపిస్తాయి. వీటిలో మీకు ఇష్టం వచ్చినవన్నీ కూర్చుకుంటూ పోతే.. మీదైన స్టైల్ లో ఒక కొత్త 3డీ అవతార్ అవతరిస్తుంది.
  • ఇదంతా చేశాక.. మళ్లీ ‘మెనూ’లోని ‘అవతార్’ సెక్షన్ లోకి వెళ్లి ‘గో టు అవతార్’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. దీంతో ‘షేర్ టు ఫీడ్’ అనేది కనిపిస్తుంది. దానిపై ఓకే అని క్లిక్ చేయగానే మీ అవతార్ ఫేస్ బుక్ ఫీడ్ లో షేర్ అయిపోతుంది. 

మరిన్ని వార్తలు.. 

సూర్యుడిపై నిఘా కోసం..సోలార్ పడవ

పాతిక వేలకు ప్లాస్టిక్ బకెట్