ఏకంగా నాలుగు ఎకరాల్లో గంజాయి పంట

ఏకంగా నాలుగు ఎకరాల్లో గంజాయి పంట

కొన్ని గ్రాముల గంజాయికే వేల రూపాయల ధర పలుకుతోంది. అలాంటిది నాలుగు ఎకరాల్లో గంజాయి పంట అంటే.. ఇక కోట్లలోనే వ్యాపారం. మత్తుకు బానిసలయినవాళ్లు ఎంత డబ్బైనా వెచ్చించి కొంటుండటంతో గంజాయికి డిమాండ్ అంతగా పెరిగింది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ముగ్గురు వ్యక్తులు ఏకంగా నాలుగు ఎకరాల్లో గంజాయి పంటను వేశారు.

కర్ణాటకలోని చిత్రదుర్గ.. రాంపురాలో ఓ ముగ్గురు వ్యక్తులు నాలుగు ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో వాళ్లు అక్రమంగా గంజాయిని పండిస్తున్నారు. ఆ గంజాయి పంట ఇప్పుడు కోతకు వచ్చింది. కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు రాంపురా పోలీసులు ఆ వ్యవసాయ క్షేత్రం మీద దాడి చేసి పంటను నాశనం చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న ఆ పంట విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ముగ్గురిని అరెస్టు చేశామని.. భూమిని లీజుకు తీసుకున్న ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

For More News..

వంతెన నిర్మాణంతో 15 కిలోమీటర్ల దూరం 1 కిలోమీటరుకు తగ్గింది

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు, ఓ మహిళ మృతి

తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మరణాలు