
అన్నం పెట్టే చేతికే సున్నం పెట్టడమంటే ఇదేనేమో. పనిచేసే షాపులోనే రూ. లక్షకు పైగా నగదును దోచుకెళ్లి పోలీసులకు చిక్కారు నలుగురు కేటుగాళ్లు . ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో జరిగింది. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 31 2019 రాత్రి విజయలక్ష్మి ఆటో మొబైల్ షాప్ లో దొంగతనం జరిగింది. ఆటో మొబైల్ యజమాని కార్వేడి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశాం. షాపులో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించాం. షాపులో పనిచేసే వాళ్ళపై అనుమానంతో ముగ్గురు యువకులను విచారించగా అసలు నిజం బయటపడింది. వీళ్లతో పాటు మరో యువకుడుని అరెస్ట్ చేశాం. నలుగురి నుంచి రూ. 118200 నగదును స్వాధీనం చేసుకున్నాం. కేసును 24 గంటలలోనే చేధించడం జరిగింది.