పిచ్చి కుక్కల స్వైర విహారం... బాలుడికి తీవ్ర గాయాలు..

పిచ్చి కుక్కల స్వైర విహారం... బాలుడికి తీవ్ర గాయాలు..

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని  నర్సాపూర్ లో పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు శ్రీరామ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. బాలుడిని హుటాహుటీన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మరో యువతిపై కూడా కుక్కలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.ఇటీవలి కాలంలో కుక్కల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలని అధికారులు సూచిస్తున్నారు.